
- పశుగ్రాసం, దాణా కూడా
లాక్ డౌన్ నేపథ్యంలో అమలు చేస్తున్న అన్న ప్రసాదం, పశుగ్రాసం , దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగిస్తామని టీటీడీ ప్రకటించింది.
ఈ నెల 20వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ లో కొన్ని మినహాయింపులు కల్పించింది. దీనివల్ల రైతులు, కూలీల జీవనోపాధి పనులు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
అందువల్ల అన్న ప్రసాదం , పశుగ్రాసం, దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకే కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
లాక్డౌన్ వల్ల తిరుపతి, పరిసర ప్రాంతాల్లో భోజనానికి ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదల ఆకలి తీర్చడం కోసం టీటీడీ గత నెల 28వ తేదీ నుంచి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.
పశువులు కూడా మేత లేక ఇబ్బంది పడుతున్నందువల్ల ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రాసం, దాణా, వీధి కుక్కలకు టీటీడీ ఆహారం అందిస్తోంది.
Leave a Reply