
- లాక్ డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదం
- కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించిన సుబ్బారెడ్డి
కోవిడ్ బాధితుల చికిత్స కోసం కేటాయించిన శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రిలో రెండు రోజుల్లో వెంటిలేటర్లతో సహా మొత్తం 500 బెడ్లు సిద్ధం చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ.సుబ్బారెడ్డి స్విమ్స్ డైరెక్టర్, డాక్టర్ వెంగమ్మను ఆదేశించారు.
ఈ విషయం గురించి ఆయన జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్తాతో మాట్లాడారు. గురువారం ఉదయం ఆయన కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించారు.
వెంటిలేటర్లు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, సానిటైజర్ల అందుబాటు గురించి అధికారులను ఆడిగితెలుసుకున్నారు. అనంతరం శ్రీ సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడారు.
500 బెడ్లతో కోవిడ్ ఆసుపత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు పద్మావతి వైద్యకళాశాల ఆసుపత్రిని కోవిడ్ ఆస్పత్రిగా ఏర్పాటు చేశామన్నారు.
ముందుగా అంచనా వేసి ముందుజాగ్రత్త చర్యగా ఇక్కడ 500 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు.
ఇందులో 110 వెంటిలేటర్లు , 390 బెడ్లు ఉంటాయన్నారు. ఇక్కడ వైద్య పరికరాలు, ఇతర కిట్ల కొనుగోలు కోసం టీటీడీ దాదాపు 20 కోట్లు జిల్లా కలెక్టరుకు అందించిందన్నారు.
అన్న ప్రసాదం పంపిణీ కొనసాగిస్తాం
లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదలకు తిరుపతి, పరిసర ప్రాంతాల్లో రోజుకు 1.40 లక్షల మందికి అన్న ప్రసాదం అందిస్తున్నామని చెప్పారు.
ఇప్పటిదాకా 26 లక్షలకు పైగా ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు ఛైర్మన్ చెప్పారు. లాక్డౌన్ ఎత్తేసే వరకూ అన్న ప్రసాదాల పంపిణీ కొనసాగిస్తామని తెలిపారు.
మూర్ఛవ్యాధి వారికి ఇంటికే మందులు
స్విమ్స్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో సుమారు 250 మంది మూర్ఛ వ్యాధి రోగులకు ప్రతినెలా మూడో ఆదివారం ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.
లాక్డౌన్ వల్ల వీరు ఇబ్బంది పడకుండా వారి గ్రామాలకే పీహెచ్ సీల ద్వారా మందులు పంపాలని డైరెక్టర్ వెంగమ్మను ఆదేశించారు.
Leave a Reply