టిటిడి సంస్థల్లో 700 మంది తో రోజూ పరిశుభ్రతా పనులు

కోవిడ్ -19 వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు టీటీడీ ఇప్పటికే తిరుమల, తిరుపతిలో మెరుగైన పరిశుభ్రత చర్యలను చేపట్టింది.

సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంతో పాటు ఇతర కార్యాలయాలు, ఉద్యోగుల నివాస సముదాయాల వద్ద కరోనా వైరస్ వ్యాప్తి ని కట్టడి చేసే చర్యలను వేగవంతం చేసింది. టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో దాదాపు 700 మంది సిబ్బంది ఈ పనులను చేపడుతున్నారు.

పరిశుభ్రత పనుల్లో భాగంగా చెత్త తొలగించడం, సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటివి చేస్తున్నారు. టిటిడి పరిపాలనా భవనం పరిసరాలతో పాటు కేంద్రీయ వైద్యశాల, సీనియర్ అధికారులు, జూనియర్ అధికారుల నివాస సముదాయాలు, ఉద్యోగుల నివాస సముదాయాల్లో రోజూ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు చేతులు శుభ్రం చేసుకునేందుకు వీలుగా శానిటైజర్లు పంపిణీ చేశారు.

తిరుపతి, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం, అప్పలాయగుంట,ఆలయాల్లో పరిసరాలను శుభ్రం చేస్తున్నారు.

అన్నప్రసాదాలు తయారుచేసే ఉద్యోగుల క్యాంటీన్, శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్, తిరుచానూరులోని అన్నదానం కాంప్లెక్స్ లో షిఫ్టుల వారీగా పారిశుధ్య పనులు చేయడంతో పాటు అక్కడి సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు.

పారిశుద్ధ్య సిబ్బందికి శరీరమంతా కప్పి ఉండేలా ప్రత్యేక కిట్లు, ఎన్-95 మాస్కులు, చేతులకు గ్లౌజులు అందించారు. చెత్త పోగవకుండా ఎప్పటికప్పుడు తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*