
- ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 7న మంగళవారం శ్రీ సీతా రాముల కల్యాణం జరుగనుంది.
ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఏకాంతంగా కల్యాణం నిర్వహిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు రాములవారి కల్యాణాన్ని వీక్షించేందుకు వీలుగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
Leave a Reply