
తిరుమలలోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది.
ప్రతి ఏడాదీ ఆలయ సమీపంలోని వసంత మండపంలో ఈ ఉత్సవాలు జరిగేవి. కరోనా వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఆలయంలోని కల్యాణ మండపంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.
కరోనా వ్యాధి నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండపంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వివరించారు.
ఈ ఉత్సవాలను భక్తులందరూ దర్శించే విధంగా ఎస్వీబీసీలో ప్రత్యక్షప్రసారం చేస్తున్నామని తెలిపారు.
Leave a Reply