శ్రీ ప‌ద్మావ‌తి కోవిడ్ ఆసుప‌త్రికి రూ.19 కోట్లు

క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల మేర‌కు జిల్లా యంత్రాగానికి టిటిడి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంద‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.

తిరుప‌తిలోని స్విమ్స్ ఆవ‌ర‌ణంలో గ‌ల‌ శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా వైద్య క‌ళాశాల‌లో రాష్ట్ర‌స్థాయి కోవిడ్ ఆసుప‌త్రిని ఏర్పాటుచేశార‌నన్నారు.

ఇందులో వెంట‌లేట‌ర్లు, ఇత‌ర వైద్య సామ‌గ్రి కొనుగోలుకు, ఇతర వ‌స‌తులు క‌ల్పించేందుకు జిల్లా యంత్రాంగానికి రూ.19 కోట్లు మంజూరుచేశామ‌ని వివ‌రించారు.

ఇందులో ఇప్ప‌టికే రూ.8 కోట్లు అంద‌జేశామ‌ని, త్వ‌ర‌లో మిగిలిన రూ.11 కోట్లు అంద‌జేస్తామ‌ని వెల్ల‌డించారు.

తిరుమ‌ల‌లో ఆదివారం ఈవో మీడియాతో మాట్లాడుతూ క‌రోనా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా తిరుప‌తిలో ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం, సాయంత్రం క‌లిపి 45 వేల‌ నుండి 50 వేల అన్న‌ప్ర‌సాద పొట్లాలు పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు.

కోవిడ్ స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, మాధ‌వం విశ్రాంతి గృహాలు, రెండో స‌త్రం, తిరుచానూరులోని ప‌ద్మావ‌తి నిల‌యం భ‌వ‌నాల‌ను జిల్లా యంత్రాంగానికి అప్ప‌గించామ‌ని తెలిపారు.

అవ‌స‌ర‌మైతే మ‌రింత స‌హ‌కారం అందించేందుకు టిటిడి సిద్ధంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఈవో తెలియ‌జేశారు.

శ్రీ‌వారి ఆల‌యంలో కైంక‌ర్యాల‌న్నీ ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని వివ‌రించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*