
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల నిర్ణయాన్ని ఏప్రిల్ 14వ తేదీ వరకు పొడిగించడమైనది.
గతంలో మార్చి 31వ తేదీ వరకు శ్రీవారి దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు టిటిడి ప్రకటించిన విషయం విదితమే.
అదేవిధంగా, ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే హనుమంత వాహన సేవను రద్దు చేసి శ్రీరామనవమి ఆస్థానాన్ని, ఏప్రిల్ 3న శ్రీరామపట్టాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఏప్రిల్ 5 నుండి 7వ తేదీ వరకు మూడు రోజులపాటు జరుగనున్న వార్షిక వసంతోత్సవాలను శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో ఏకాంతంగా జరుపుతారు.
Leave a Reply