
శ్రీవారి ఆశీస్సులతో విశ్వంలోని సమస్త జీవకోటి ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో ఉంటారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ ఉద్ఘాటించారు.
ఈ సందర్భంగా స్వరూపనందేంద్ర స్వామివారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య మంత్రులు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, కె.చంద్ర శేఖర్ రావులు దేశ, తెలుగు రాష్ట్రాల ప్రజల కోరకు, సమాజం కొరకు ప్రజలు తమ తమ ఇళ్లలో ఉండాలని, బయటకు రాకుడదని, జనసందోహం ఉండకూడదన్నారు.
ఇలాంటి పరిస్థితులలో టిటిడి మార్చి 16 నుండి 25వ తేదీ వరకు ప్రముఖ పండితులతో తిరుమలలో శ్రీనివాస వేదమంత్ర ఆరోగ్య జపయజ్ఞం ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
అదేవిధంగా మార్చి 26 నుండి 28వ తేదీ వరకు ధన్వంతరి మహాయాగాన్ని ప్రముఖ నిష్ణాతులైన పండితులతో టిటిడి అద్భుతంగా నిర్వహించిందన్నారు.
ఈ యాగం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రపంచ మానవాళికి అశాంతిని, ఆనారోగ్యాన్ని దూరం చేసి సర్వతోముఖా భివృద్ధిని ప్రసాదించాలన్నారు.
Leave a Reply