బ్రహ్మరథోత్సవం భగవాణుడి విరాట్ విశ్వరూప దర్శన సమానం

బ్రహ్మరథోత్సవం భగవాణుడి విరాట్ విశ్వరూప దర్శన సమానం రథం దేహంతో నూ,

రథోత్సవాణ్ణి జీవి జీవనయాత్ర గాను పోల్చి చూసి…జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవాలి అంటారు శాస్త్రకారులు

ఈ జీవిరథానికి ఉన్న 6 చక్రాలు అరిషట్ వర్గాలైన కామ,క్రోధ,లోభ,మోహ,మధ, మాశ్చర్యం లకు ప్రతీకగా, ఉండి దేహం అనే ఈ రథాన్ని వివిధ దిక్కులకు లాగుతూ, రథానికి ఉన్న రెండు మోకులు, పగలు ,రాత్రి అనే కాలానికి చిహ్నాలుగా….ఆనంతకోటి కోరికలు ఆ రథాన్ని లాగుతుండగా….

ఆ రథం ప్రయాణించే నాలుగు మాడా వీధులే బాల్య,యవ్వన,కౌమార,వ్యర్ధక్యాలుగా ఆ జీవి పడే భాద ,ఆ సంసార సాగరం నుండి ఎవరు నన్ను రక్షిస్తారో అని చూస్తుండగా….

ఆ రథం యొక్క హృదయ స్థానంలో ఆ ఆనందకలాత్మికుడు,భక్తవత్సలుడు, అయిన శ్రీ స్వామి వారు అస్సీనులయినంతనే….

అరిషట్చక్ర యుక్త, కాలసర్ప పరివేష్టిత,సహాశ్ర లక్షా అక్షోయిని కామ్యకులు లాగుతున్న అంతటి బ్రహ్మరథం కూడా ఎంతో క్రమశిక్షణతో ,సురక్షితంగా, ఆ నాలుగు మాడా వీధులు దాటుకుని యదా స్తానం చేరుతున్నదో…

అదే విదంగానే *జీవి తన జీవన యాత్రలో హృదిస్తానం లో భక్తి అనే సాధనతో భగవంతుని ఆరాధిస్తే* ,ఎలాంటి వికారాలకు,అవస్తలు ఆవహించినప్పటికి, జీవుడు మోక్షాన్ని పొంది ,ఆ పరమాత్మలో కలిసిపోయే ఆ క్షణం , *ఆహా ఆ జీవి యొక్క జీవన యాత్రే కదా బ్రహ్మరథోత్సవం*

*సామాన్యులు,అప్రదానులు* సహితం బాగవద్ అనుగ్రహం కలిగినంతనే *అసామాన్యులుగా, అత్యంత ప్రాధన్యులు* అవుతారే

అదే విదంగా…. , *నిర్జీవమైన రథం అనే దేహం,భగవంతుడు అనే ఆత్మ ప్రవేశించిన వెంటనే ఎలా తేజోవంత మై పుణ్యకర్మలతో భగవంతుని చేరుతుందో, అలా రథోత్సవాన్నీ మన చరిత్రకారులు వర్ణిస్తారు….*

364 రోజుల పాటు ఎటువంటి చలనం లేకుండా నిలబడి ఉన్న రథానికి, పాల్గుణమాసం లో జరిగే తిరునాళ్ళ లో భాగంగా *స్వామి వారు* రధ హృదయ స్థానం లో *ఆశీనులైనంతనే బ్రహ్మాది ముక్కోటి దేవతలు వొచ్చి కొలువై ,విశేష ఆరాదనలు,యజ్ఞాలు,బలిహారణాలు జరిగి,సామాన్య రథంమీ బ్రహ్మరదోత్సవం గా జరగడం విశేషం*
రథయాత్రలో పాల్గొనడం అంటే *ఒక జన్మను పరిపూర్ణత గావించుకోవటం తో సమానం అని పెద్దల మాట*

*రథస్త్వం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే*
రథంలో కొలువైన స్వామివారిని దర్శించుకోవడం ద్వారా, ప్రదక్షిణలు చేయడం ద్వారా పునర్జన్మ ఉండదని, సర్వ పాపాలు హరిస్తాయని , *తూర్పున ధర్మం, పడమట జ్ఞానం, ఉత్తరాన ఐశ్వర్యం, దక్షిణాన మోక్షం* లభిస్తుందని ఆగమలు చెబుతున్నాయి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*