శ్రీవారి పుష్క‌రిణి మూత – కరోనా కల్లోలం

తిరుమ‌లలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో బాగంగా బుధవారం మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల నుండి శ్రీ‌వారి పుష్క‌రిణిని మూసివేస్తున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.

తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి పుష్క‌రిణిని గురువారం ఉద‌యం అద‌న‌పు ఈవో అధికారుల‌తో క‌లిసి త‌ణిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి పుష్క‌రిణిలో భ‌క్తులు స్నానం చేస్తే క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఎక్కువ కావున పుష్క‌రిణిని మూసివేస్తున్న‌ట్లు తెలిపారు.

క‌రోనా నేప‌థ్యంలో భ‌క్తుల ఆరోగ్యం దృష్ఠ్యా పుష్క‌రిణి నీటితో 18 ష‌వ‌ర్‌ బాత్‌లు ఏర్పాటు చేశామ‌న్నారు.

పుష్క‌రిణి నీటితో ఏర్పాటు చేసిన  ష‌వ‌ర్లలో స్నానం చేసిన‌, పుష్క‌రిణిలో స్నాన‌మాచ‌రిస్తే వ‌చ్చే పుణ్య‌ఫ‌లం ల‌భిస్తుంద‌న్నారు.

పుష్క‌రిణి ప‌రిస‌రాల‌ను ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి అంటు రోగ నివార‌ణ మందుల‌తో శుభ్రం చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఎస్ఇ – 2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, ఇఇ వాట‌ర్క్స్ శ్రీ శ్రీ‌హ‌రి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*