హంసవాహనంపై ఊరేగిన కదిరి నరసింహ స్వామి

3వ రోజు బ్రహ్మోత్సవాలు లో మూడవ రోజు హంసవాహణం పై వీణా పానియై,అపార జ్ఞాన మూర్తి యై, శ్రీ ఖాద్రి పరమహంసగా, విద్యా నృసింహుడై దర్శనమిచ్చారు.

మొదటి వాహనంగా స్వయంగా బ్రహ్మ భక్తితో సమర్పించిన తన వాహన మైన హంస వాహనంపై స్వామి వారికి మొదటి ఉత్సవం నిర్వహిస్తుండగా ముక్కోటి దేవతలు వీణా నాద ప్రమోదితాయ నమః అని కీర్తిస్తున్నారు.

నిర్మల హిమగిరులలో మానస సరోవర ప్రాంతాల్లో సంచరించే ఆ హంస ఈరోజున శ్రీ ఖాద్రి భక్త జనులు హృదయ మానస సరోవరాల్లో విహరించే ఈ శ్రీ ఖాద్రి మందిర సుందర పరమాత్మ హంస సేవలో రాజా హంస గా తరిస్తున్నది.

హంస క్షీర,నీరాలను వేరుచేసి క్షీరాన్ని ఆస్వాదిస్తే, పరమ హంస, జీవి పాప పుణ్యాలను వేరు చేసి పుంన్యాని ఆచరింపచేస్తుంది.

ఖాద్రి సమొహన పరమాత్మ హంస నిత్యా,అనిత్యా వివేచనాన్ని కలిగించి జీవులను నిత్యసురులుగా మారుస్తుంది ,అంటే జ్ఞాన వంతులుగా చేసి,మోక్షాన్ని ప్రాప్తిమ్ప జేస్తుందని అర్థం.

హంసను ప్రాణానికి సంకేతంగా… ,సత్యా,అసత్యా విశ్లేషాన్ని,… ఆత్మా, అనాత్మల వ్యత్యాసం తెలుపడమే హంస తత్వం గా వేద ఋక్కులు గొషిస్తున్నాయి.

ఈరోజున మన అజ్ఞానాన్ని తొలగించి దర్మా, అధర్మ వివేచన జ్ఞానాన్ని ప్రాప్తిపజేయడానికి శ్రీ ఖాద్రీసుడు, జ్ఞాన నారసింహుడై దర్శనమిస్తున్నారు.

స్వామి వారిని విశేష మృదంగా వాద్యముల కీర్తనలతో నాలుగు మాడ వీధుల్లో ఊరేగే దివ్య దృశ్యాన్ని భక్తులు కనులారా వీక్షించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*