జూన్‌ నెల కోటా శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుద‌ల‌ : 60,666

2020, జూన్‌ నెల కోటాకు సంబంధించి మొత్తం 60,666 శ్రీవారి ఆర్జితసేవా ఆన్‌లైన్‌ టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి.

ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,966 సేవా టికెట్లు విడుదల చేశారు. ఇందులో

సుప్రభాతం 7,681, తోమాల 130, అర్చన 130, అష్టదళపాదపద్మారాధన 300, నిజపాదదర్శనం 1,725 టికెట్లు ఉన్నాయి.

– ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 50,700 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 6,600, సహస్ర దీపాలంకారసేవ 17,400 టికెట్లు ఉన్నాయి.

ఆర్జితసేవా టికెట్ల నమోదు వివరాలు  :

– ఆన్‌లైన్‌లో ఆర్జితసేవా టికెట్ల విడుదల : మార్చి 6, ఉదయం 10 గంటలకు.

– ఎలక్ట్రానిక్‌ డిప్‌ నమోదుకు చివరి తేది   : మార్చి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు.

– ఎలక్ట్రానిక్‌ డిప్      : మార్చి  10న ఉదయం 10 నుండి 12గంటల వరకు.

– నగదు చెల్లింపు     : మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*