మార్చి 13 నుండి విశాఖ‌ప‌ట్నం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 13 నుండి 31వ తేదీ వరకు విశాఖ‌ప‌ట్నం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లోని 12 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది.

సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో(సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)..

– మార్చి 13వ తేదీన అన‌కాప‌ల్లిలోని సుబ్ర‌మ‌ణ్య కాల‌నీలో గ‌ల శ్రీ రామాల‌యంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– మార్చి 14న దేవ‌ర‌ప‌ల్లి మండ‌లంలోని సామిద గ్రామంలో శ్రీ రామాల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– మార్చి 15న మాడుగుల మండ‌లంలోని ఓండ్రువీధి గ్రామంలో గ‌ల శ్రీ రామాల‌యంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– మార్చి 16న బుచ్చ‌య్య‌పేట మండ‌లం, ఐతంపూడి ఎస్‌సి కాల‌నీలో గ‌ల శ్రీ వినాయ‌క స్వామివారి ఆల‌యంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– మార్చి 17న మున‌గ‌పాక మండ‌లం మేలిపాక గ్రామంలోని శ్రీ రామాల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– మార్చి 18న య‌ల‌మంచ‌లి మండ‌లం కొక్కిర‌ప‌ల్లి పంచాయ‌తీ రెల్లివీధిలో గ‌ల‌ శ్రీ రామాల‌యంలో ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– మార్చి 19న పాయ‌క‌రావుపేట‌ మండ‌లం స‌త్య‌వ‌రం గ్రామంలోని శ్రీ రామాల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

తూర్పుగోదావ‌రి జిల్లా(సాయంత్రం 6 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)లో..

– మార్చి 27న శంక‌వ‌రం మండ‌లం, ఎం.జ‌గ‌న్నాథ‌పురంలో గ‌ల శ్రీ రామాల‌యంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– మార్చి 28న రంగంపేట మండ‌లం, కోట‌పాడు పంచాయ‌తీ, రామ‌కృష్ణాపురం గ్రామంలో గ‌ల శ్రీ రామాల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– మార్చి 29న కార‌ప మండ‌లంలోని న‌డ‌కుడూరు గ్రామంలో గ‌ల శ్రీ రామాల‌యంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– మార్చి 30న ఉప్ప‌ల‌గుప్తం మండ‌లం, ఎస్‌సి యానం పంచాయ‌తీ, ఎస్‌సి చిన్న‌పేట గ్రామంలో గ‌ల శ్రీ రామాల‌యంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– మార్చి 31న అమ‌లాపురం మండ‌లం రొళ్ల‌పాళెం గ్రామం సుంద‌ర‌న‌గ‌ర్ కాల‌నీలోని శ్రీ రామాల‌యంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*