
గోరింటాకు అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అలాంటి విశిష్టమైన గోరింటాకు చరిత్ర ఏంటి ?అంత ప్రాధాన్యత ఎలా వచ్చింది?
గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది.
ఈవింతను చెలులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకువస్తాడు.
అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలన లోకానికి
ఏ ఉపయోగం కలదూ అని అడుగుతుంది.
అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి.
అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధా కలుగలేదు
పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది.
పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది.
రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు,స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈచెట్టు జన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు.
ఆసమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడాఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో!!
నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో ఆసందేహం చెప్పగా…. నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు.
ఇక శాస్త్రపరంగా గర్భాశయదోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి.
వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంత పరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయబాధలు నయం ఔతాయి.
Leave a Reply