వేప రావి చెట్లకు పెళ్ళెందుకు చేస్తారు.. భృగు మహర్షి ఏం చెప్పారు?

వేప,రావి ఇతర చెట్లకు పెళ్ళిళ్లు చేస్తారు ఎందుకు? అందులోని సారాంశం ఏమిటి. వాటికేమైనా ప్రాణం ఉందా? అవేమైనా సంభాషించుకోగలవా?

ఇదెక్కడి మూడ నమ్మకం అనుకుంటుటారు. కానీ, మహాభారతములో ఉన్న ఈ సంభాషణ చూసిన తరువాత చెట్లకు ఏ ఏ లక్షణాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఏడుకొండలు ఆ సందర్భాన్ని మాత్రం మీ ముందుకు తెస్తోంది.

మహా భారతంలోని శాంతి పర్వం 184 వ అధ్యాయంలో భృగు, భరద్వాజ మహర్షుల సంభాషణ అది. ఇందులో “భరద్వాజుడిలా అడుగుతాడు.

“వృక్షములు చూడవు, వినవు, రస గ్రంథాలను అనుభవించవు, స్పర్శ లేదు కదా అయినా అవి కూడా “పాంచభౌతిక చేతన పదార్తములే ” అని ఎందుకంటారో చెప్పండని భృగు మహర్షిని అడుగుతాడు.

భృగు మహర్షి ఇలా సమాధానం ఇస్తాడు. వృక్షములెంత గట్టిగా కనిపించినను వానిలోనూ ఆకాశమున్నది. దీని వలననే నిత్యం పుష్ప ఫలముల ఉత్పత్తి సాధ్యమగుచున్నది.

వృక్షములలో వేడి ఉంటుంది. కాబట్టే, ఆకులు, బెరళ్ళు, పూలు, కాయలు, పళ్ళు వాడిపోతాయి, రాలిపోతాయి. దీని అర్థమేమిటి మొక్కలలో స్పర్శ జ్ఞానముంది.

వాయువు,అగ్ని,విద్యుత్ యొక్క ఫెళ ఫెళ శబ్దాలు చేసినప్పుడు చెట్ల నుండి ఆకులు, పూలు, పళ్ళు రాలి పడుతాయి. అంటే అర్థం ఏమిటి? చెట్లకు వినికిడి జ్ఞానం ఉన్నట్లే కదా!

తీగ చెట్టును నలువైపులా చుట్టుకొని పైపైకి పాకుంది. చూడకుండానే ఎవరైనా ముందుకెలా వెళ్ళగలుగుతారు. అంటే మొక్కలు చూడగలుగుతాయనే కదా !

సువాసన – దుర్వాసనల వలన ,అట్లే అనేక రకాల పొగ వాసనల వలన, అగరు వత్తుల వాసన వలన వృక్షములు రోగరహితములగుచున్నవి మరియు పుష్పించుచున్నవి. దీనివలన వృక్షాలు వాసన చూస్తాయని కూడా తెలియుచున్నది.

వృక్షములు తమ వేళ్ళ తో నీరు త్రాగుతాయి. చెట్టుకు ఏదేని రోగము వస్తే నీళ్ళలో మందు కలిపి చికిత్స చేసే పద్ధతి ఉంది. దీనివలన వృక్షాలకు రుచికి సంభందించిన జ్ఞానం ఉందని తెలియుచున్నది.

మనం కమలపు కాండం నోటిలో పెట్టుకొని నీటిని పీల్చుకోగలుగుతాము. అదే విధముగా వృక్షములు గాలి ఒత్తిడి వలన వృక్షములు వేళ్ళ ద్వారా నీటిని పైకి పీల్చుకుంటున్నాయి.

వృక్షము తెగిన చోట క్రొత్త పిలక పుడుతుంది. అంటే తనకు గాయం అయ్యిందని తెలుసుకుని తిరిగి మాన్పుకున్నట్లే కదా. అవి సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి. కనుక వృక్షములలో ప్రాణమున్నది. అవి అచేతనాలు కావు.

వృక్షములు వేళ్ళ ద్వారా పీల్చిన నీటిని చెట్టులోని వాయువు, అగ్ని ఉడికిస్తాయి. ఆహారం పరిపక్వమైనప్పుడు వృక్షము నిగనిగలాడుతూ ఉంటుంది.

ఇలా భృగు మహర్షి అనేక ఋజువులు చూపిస్తూ నిజమైన ‘వృక్ష పితామహుడు’ అని అనిపించుకున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*