ఒకే పీఠంపై శివ పార్వతులు… ఎక్కడ?

శివపార్వతులు ఒకే పీఠంపై దర్శనమిస్తారు. అది నేటి ఆలయం కాదు. 1800 ఏళ్ళకు పూర్వ నిర్మించిన ఆలయంగా తెలుస్తోంది. శివపార్వతులు ఒకే ఆలయంపై దర్శనమిచ్చే ఆ ఆలయం ఎక్కడ ఉంది?

తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.

ఆంధ్రప్రదేశ్‌‌లోని కృష్ణా జిల్లాలోని ఘంటసాల అనే గ్రామంలో ఈ ఆలయం కొలువుదీరింది. బాలపార్వతీ సమేత జలధీశ్వర ఆలయం అని పిలవబడే జలధీశ్వర స్వామి ఆలయం ఉంది.

ఒకే పీఠంలో శివ మరియు పార్వతిలను కలిగి ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇది.

ఇది పురాతన ఆలయాలలో ఒకటి, ఇది 2 వ శతాబ్దానికి ముందు ఉన్నదని నమ్మకం. అప్పట్లో శివుడు, పార్వతి విగ్రహాలుఒకే “పీఠం” (పానవట్టము) లో ఉంచుతారనేది వాస్తవం.

జలదేశ్వర ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో నాలుగవ పురాతన ఆలయంగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం ఆలయానికి ఈ ఆలయానికి సారూపత్యలు ఉన్నాయి.

ఆలయ చరిత్ర ప్రకారం, అగస్త్యుడు మహర్షి చేత పీఠం ఉంచబడింది. ఈ దేవాలయంలో నందీశ్వరుడు విగ్రహం అందమైన మరియు వాస్తవికమైనది.

ఒకే ఒక పీఠంపై శివ మరియు పార్వతి స్థాపన కారణంగా ఈ ఆలయం దర్శనం చేసుకుంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు (12) మరియు అష్టాదశ శక్తి పీఠాలు (18) యొక్క దర్శనానికి సమానం అని ప్రతీతి.

జలధీశ్వర స్వామి తీర్థం సేవిస్తే అనేక వ్యాధులు నివారణ అవుతాయి అని భక్తుల విశ్వాసంతో నమ్ముతారు. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.

ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించెదరు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*