
శ్రీకాళహస్తిలోని భ్రమరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కల్యాణోత్సవం సందర్భంగా టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఛైర్మన్ దంపతులు, ఈవో దంపతులకు శ్రీకాళహస్తి ఆలయ ఈవో శ్రీ సి.చంద్రశేఖర్‌రెడ్డి, అర్చకబృందం కలిసి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను టిటిడి ఛైర్మన్, ఈవోలకు అందించారు.
శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 16న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 28వ తేదీ వరకు జరుగనున్నాయి. గత 20 ఏళ్లుగా టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రీనివాసుడి సోదరి అయిన భ్రమరాంబ సౌభాగ్యం కోసం శ్రీవారు పట్టువస్త్రాలు పంపుతున్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు శ్రీ గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply