రేపటి నుంచి ”అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం’

తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఫిబ్ర‌వ‌రి 24, 25వ తేదీల్లో అన్నమయ్య సంకీర్తనల‌ అఖండ మ‌హాయ‌జ్ఞం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

ఫిబ్ర‌వ‌రి 24న సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం నుండి అన్న‌మ‌య్య ఉత్స‌వ విగ్ర‌హం ఊరేగింపు మొద‌ల‌వుతుంది.

క‌ళాకారులు సంకీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా కోదండరామాలయ మాడ వీధుల గుండా అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళ‌తారు.

సాయంత్రం 6 గంటల నుండి మ‌రుస‌టిరోజైన మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల పాటు నిరంతరాయంగా క‌ళాకారులు సంకీర్తనలను ఆలపిస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*