
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు నంది వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి పురవీధుల్లో ఈ వాహనసేవ జరిగింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఈఓ పి.బసంత్ కుమార్, సివిఎస్వో గోపీనాధ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ప్రధానార్చకులు మణిస్వామి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Leave a Reply