రేపు ఎస్వీ వేద విశ్వవిద్యాలయ స్నాత‌కోత్స‌వం

తిరుపతిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 5వ స్నాత‌కోత్స‌వం ఫిబ్ర‌వ‌రి 20వ తేదీన జ‌రుగ‌నుంది.

రాష్ట్ర గ‌వ‌ర్న‌రు శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రుగ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రివ‌ర్యులు శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగి పాల్గొంటారు.

గురువారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని యాగ‌శాల‌లో స్నాత‌కోత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఇందులో 2017, జూలై 13 నుండి 2019, జూలై 31 వ‌ర‌కు ఉత్తీర్ణులైన 200 మందికి బ్యాచిల‌ర్స్ డిగ్రీ, 104 మందికి మాస్ట‌ర్ డిగ్రీ, ఇద్ద‌రికి ఎంఫిల్‌, ఐదుగురికి పిహెచ్‌డి ప‌ట్టాలు ప్ర‌దానం చేస్తారు.

అదేవిధంగా, తిరుప‌తికి చెందిన వేద‌పండితుడు బ్ర‌హ్మ‌శ్రీ మ‌ద్దుల‌ప‌ల్లి సూర్య‌నారాయ‌ణ ఘ‌నాపాఠికి మ‌హామ‌హోపాధ్యాయ పుర‌స్కారం ఇవ్వనున్నారు.

కేంద్ర‌మంత్రివ‌ర్యులు, సంస్కృత పండితులైన‌ శ్రీ ప్ర‌తాప్‌చంద్ర సారంగికి, విశాఖ‌ప‌ట్నంకు చెందిన శాస్త్ర పండితుడు శ్రీ‌ చాగంటి ప్ర‌కాశ‌రావుకు వాచ‌స్ప‌తి పుర‌స్కారాలు అంద‌జేస్తారు.

జాతీయ‌స్థాయిలో క్రీడ‌లు, సాంస్కృతిక అంశాలు, ప‌రిశోధ‌నాప‌త్రాలు పొంది ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన విద్యార్థుల‌కు ప్ర‌శంసాప‌త్రాలు అందిస్తారు.

ఎస్వీ వేద వ‌ర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్ ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌నశ‌ర్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ స్నాత‌కోత్స‌వం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*