శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి ఛైర్మన్, ఈవో

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామివారికి సోమవారం టిటిడి బోర్డు ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పట్టువస్త్రాలు సమర్పించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి శ్రీశైలంలో పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఛైర్మన్, ఈవోలకు శ్రీశైలం ఆలయ ఈవో శ్రీ కెఎస్.రామారావు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

ఛైర్మన్, ఈవో స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాధికారులు టిటిడి ఛైర్మన్ కు, ఈవోకు తీర్థప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటం అందించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*