వామ్మో….. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత (వీడియో)

శ్రివారి మెట్టు మార్గంలో చిరుత సంచారం చేస్తోంది. జింకను చంపి తిన్న ఆనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మార్గంలో తిరుమలకు వెళ్ళాలంటే భక్తులు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

ఆదివారం రాత్రి శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గంలో 250వ మెట్టు వద్ద జింక పిల్లను చంపి తిన్నట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడే మెట్లమీదే జింక మృతదేహం పడి ఉంది.

జింక శరీరంలో కొంత భాగాన్ని చిరుత తిని వదలివేసింది. ఉదయం ఆ మార్గాన తిరుమలకు వెళ్ళే భక్తులు సమాచారం అందించడంతో
ఘటన స్థలాన్ని చేరుకున్న విజిలెన్స్, అటవీ సిబ్బంది జింక మృతదేహాన్ని అక్కడ నుంచి తొలగించారు.

చిరుత సంచారం నేపథ్యంలో ఉదయం పూట 6:45 నిమిషాలకు పైన భక్తులను అనుమతిస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*