
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 25న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీ విష్వక్సేనులవారు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ నమ్మాళ్వార్, శ్రీ కూరత్తాళ్వార్, శ్రీ తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది.
తిరుపతి వీధుల గుండా కపిలతీర్థానికి చేరుకున్న అనంతరం అక్కడ తిరుమంజనం, ఆస్థానం నిర్వహించారు.
అక్కడినుంచి బయల్దేరి పిఆర్ గార్డెన్ మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంది.
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో రవికుమార్ రెడ్డి, సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్, శర్మ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు కృష్ణమూర్తి, మునీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply