చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారు క‌నువిందు

తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్ర‌ప్ర‌భ వాహనంపై కపిలేశ్వరస్వామివారు తిరుపతి పురవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.

గజాలు, వృషభాలు ముందు వెళుతుండగా, కళాబృందాల కోలాటాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి.

వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ భూప‌తిరాజు, ఎవిఎస్వో సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*