
గతంలో తిరుమల వెంకటేశ్వర స్వామి తో భక్తులు నేరుగానే సంభాషించే వారని అనడానికి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి.
వాటిలో అనంతాచార్యులు సంఘటన ఒకటి. ఎవరి అనంతాచార్యులు. వెంకటేశ్వర స్వామికి ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి?
తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
అనంతాచార్యులు కొండమీద స్వామివారికి పూలుగుచ్చి దండలు సిద్ధం చేసేవారు.
ఈయన ఒకరోజున తనపనిలో నిమగ్నమై ఉండగా రమ్మనమని స్వామివారు కబురు పంపారట.
దానికి ఆచార్యులవారు ‘‘ఆయనకు వేరేపని ఏముంది కనుక, హాయిగా పీఠమెక్కి కూచుంటాడు. కబుర్లకోసం నాకు రావడం కుదరదు’ అని చెప్పిపంపి సాయంత్రం ఆ దండలన్నింటినీ గౌరవంగా ఒక బుట్టలో పెట్టుకుని వెళ్ళాడు.
‘‘నేను రమ్మంటే రానప్పుడు, నీ పూలదండలు నాకెందుకు, అక్కరలేదు ఫో!’’ అని స్వామివారు కసురు కున్నారట. దానికి అనంతాచార్యులవారు ‘నీవెవరు నన్నుపొమ్మనడానికి. నీదా ఈ కొండ?
వరాహ స్వామిదగ్గర నీవు ఎలా పుచ్చుకుని వచ్చావో, అలా మా గురువుగారు వెళ్ళమంటే నేను వచ్చా. గురువుగారు దండలిమ్మన్నారు. వచ్చి ఇస్తుంటా.
పుచ్చుకుంటే పుచ్చుకో. లేదంటే ఊరుకో. ఇక్కడ ఈ తలుపు కొయ్యకు తగిలించి పోతున్నా. నీ ఇష్టం.
నేను మాత్రం నా పని వదిలి కబుర్లకు రాను’’ అని చెప్పి వెళ్ళిపోతుంటే స్వామివారే వెంటపడి ఆయనను బుజ్జగించి వెనక్కి తీసుకొచ్చారట.
అంత పిచ్చి భక్తి చూపిన అనంతాళ్వారు వారికి వెట్టిచేసావా స్వామీ’’ అని అన్నమయ్య అంటున్నారు.
Leave a Reply