శ్రీనివాసమంగాపురంలోని వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 14 నుండి 22వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ.

ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ రోజు ఉదయం వాహనం సాయంత్రం వాహనం
14-02-2020 శుక్ర‌వారం ధ్వజారోహణం పెద్దశేష వాహనం
15-02-2020 శనివారం చిన్నశేష వాహనం హంస వాహనం
16-02-2020 ఆదివారం సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
17-02-2020 సోమవారం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
18-02-2020 మంగళవారం పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
19-02-2020 బుధవారం హనుమంత వాహనం            స్వర్ణరథం,  గజ వాహనం
20-02-2020 గురువారం సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
21-02-2020 శుక్రవారం రథోత్సవం అశ్వవాహనం
22-02-2020 శనివారం పురుషామృగవాహనం                     కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
23-02-2020 ఆదివారం చక్రస్నానం ధ్వజావరోహణం

 

పెద్ద శేషవాహనంపై…

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శుక్ర‌వారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ప‌ర‌మ‌ప‌ద వైకుంఠ నాధుడి అలంకారంలో భక్తులను క‌టాక్షించారు.

బ్రహ్మూెత్సవాల్లో శ్రీవారు స్వయంగా ఊరేగింపులో పాల్గొనే మొదటి ఉత్సవం పెద్దశేషవాహనం. ఈ శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి

అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు.

తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*