మొలతాడు కడితేనే మగాడా? ఎందుకు కడతారు?

పరూషంగా మాట్లాడే సమయంలో ‘నువ్వు మొలతాడు కట్టిన మొగాడివే అయితే… రా!’ అని అంటుంటారు. మొలతాడు మీది రకరకాల మాటలు వాడుకలో ఉన్నాయి.

పౌరుషాలు, పట్టుదలలు పక్కన పెడితే అసలు మొలతాడు ఎందుకు కడతారు? దాని వలన ఏమిటి ఉపయోగం. ఏదైనా శాస్త్రీయత ఉందా? ఆరోగ్య రహస్యాలు ఉన్నాయా? అవి ఏమి చెబుతాయి?

తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

అమ్మ చెప్పింది. నాన్నమ్మ కట్టింది అనుకునే మాటే కానీ, మొలతాడు ఎందుకు కట్టుకుంటారో చాలా మందికి తెలియదు. ఏడుకొండలు తనకు తెలిసింది చెబుతోంది తెలుసుకోండి.

చిన్న‌త‌నంలో ఆడ‌, మ‌గ తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు త‌మ పిల్ల‌ల‌కు మొల‌తాడును క‌డ‌తారు. వ‌య‌స్సు పెరిగే కొద్దీ కేవ‌లం మగవారు మాత్ర‌మే దాన్ని ధ‌రిస్తారు. ఆడ‌వారు ధ‌రించ‌రు.

మొలతాడులో చాలా రకాలు ఉన్నాయి. మొలతాడులో చాలా రకాలు ఉన్నాయి. చిన్నతనంలో బంగారం, వెండి మొలతాడులు కడుతారు. పెద్దైన తరువాత నల్లదారం, ఎర్రదారం మొలతాడుగా ధరిస్తారు.

మొలతాడు ధరించడానికి కారణం ఏంటంటే చిన్న పిల్ల‌ల‌కు మొల‌తాడు క‌డితే వారు ఎదుగుతున్న స‌మ‌యంలో ఎముక‌లు, కండ‌రాలు స‌రైన ప‌ద్ధ‌తిలో వృద్ధి చెందుతాయ‌ట‌.

ప్ర‌ధానంగా మ‌గ పిల్ల‌ల్లో పెరుగుద‌ల స‌మ‌యంలో పురుషాంగం ఎటువంటి అస‌మ‌తుల్యానికి గురికాకుండా క‌చ్చిత‌మైన పెరుగుద‌ల ఉండేందుకు మొల‌తాడును క‌డ‌తార‌ట‌.

మొల‌తాడు క‌ట్టుకుంటే ర‌క్త ప్ర‌స‌ర‌ణ కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. మ‌గ‌వారికి హెర్నియా రాకుండా మొల‌తాడు నివారిస్తుందట. దీన్ని ప‌లువురు సైంటిస్టులు నిరూపించార‌ట‌ కూడా.

 

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*