ఇంట్లో తల్లదండ్రులు బాధపడుతుంటే వాస్తు దోషం ఉన్నట్లేనా? అయితే ఏం చేయాలి?

ఇల్లు అనేది జీవితంలో కట్టుకోక తప్పదు. సొంతిల్లు ప్రతి వారి కల. అలాంటి ఇల్లు అనుకూలంగా ఉండాలి లేకపోతే ఆ మనశ్శాంతి ఉండదు.

ఇంట్లో ఉండే పెద్దలు, తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టేనా..? అంటే ఖచ్చితంగా వాస్తు దోషం ఉన్నట్లేనని శాస్త్రాలు చెబుతున్నాయి.

కొన్నిమార్లు ఎన్ని వాస్తు నియమాలను పాటించినా, ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు. నిజంగానే వాస్తు బాగోలేనట్లేనా.

అంటే కొన్ని శాస్త్రాల ప్రకారం ఎన్నో ఏళ్ల పరిశీలన తరువాత వాస్తు ఫలితాలను ఇలా ఉంటాయని చెబుతారు.

ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో…
ఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయో……
ఏ ఇంట్లో ఆక్రందనలుంటాయో…..
ఆ ఇంటికి వాస్తు దోషం వుంటుందంటారు.

జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులు, వృధ్ధులు, బాధపడే ఇంట్లో వాస్తు దోషం వున్నట్లేనని చెబుతారు.

అందుకే సాధ్యమైనంత వరకూ ఇల్లు కట్టుకునే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. కాదు, కాదు, ఇంటి స్థలం ఎంచుకునే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి.

అన్నింటికి మించి మన ప్రవర్తనలో దోషం వుంటే మనం ఏ ఇంటికి వెళ్ళినా సుఖశాంతులు ఉండవు. ఎంత బాగా వాస్తు ప్రకారం కట్టిన ఇల్లయినా కలసిరాదు.

అందుకే ముఖ్యంగా మన ప్రవర్తనని సరి చేసుకోవాలి. అప్పుడు ఏ ఇంట్లోనైనా సంతోషంగా వుండవచ్చు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*