శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని రాజపక్సే

శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్స మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

శ్రీలంక ప్రధాని మహంద్ర రాజ పక్సే సోమవారం రాత్రి తిరుమల చేరుకున్నారు.

ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్, మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డిలు ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం అక్కడే బస చేసిన ఆయన మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవలో రాజపక్స పాల్గొన్నారు.

అనంతరం ప్రధానికి ఆలయ అర్చకులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. వేదపండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*