ఘరానా మోసగాళ్ళు… మరోమారు తిరుమలలో నకిలీ టికెట్లు

తిరుమల కేంద్రంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.

స్వామిని దర్శించుకోవాలి అనుకునే భక్తుల నమ్మకమే కేటుగాడు లకి  ప్రధాన ఆసరాగా నిలుస్తోంది.

తాజాగా  సుప్రభాతం అభిషేకం  నకిలీ టికెట్లను నమ్మిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

చెన్నైకి చెందిన రవినారాయణన్‌ అనే భక్తుడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోసం బెంగుళూరుకు చెందిన భరత్‌ అనే వ్యక్తి ద్వారా రాహుల్‌ అనే దళారీని సంప్రదించాడు.

రాహుల్‌ రూ.73 వేల నగదు ఆన్‌లైన్‌ ద్వారా తీసుకుని డిసెంబరు 13వ తేదీకి 18 అభిషేకం టికెట్లు, 2020 జనవరి 13వ తేదీకి 10 సుప్రభాత సేవాటికెట్లను వారికి విక్రయించాడు.

టికెట్లతో డిసెంబరు 13న వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. అక్కడ టిటిడి సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు.

రంగంలోకి దిగిన టిటిడి విజిలెన్స్ అధికారులు టికెట్లను పరిశీలించారు.

పాత టికెట్లు లోని వివరాలను మార్పు చేసి ఇచ్చారనే విషయాన్ని అధికారులు పసిగట్టారు.

దీంతో నిందితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

అవి నకిలీవని తేలిపోవడంతో విజిలెన్స్‌ అధికారుల నివేదిక మేరకు ఫిబ్రవరి 5వ తేదీన టూ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్టు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*