తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని రాజ పక్సే (వీడియో)

శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సే సోమవారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు.

తిరుమలలోని పద్మావతి విశ్రాంతిగృహం వద్దకు చేరుకోగానే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తుడ ఛైర్మన్, టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి శ్రీలంక ప్రధానికి స్వాగతం పలికారు.

శ్రీలంక ప్రధాని వెంట కుమారుడు యోషిత రాజపక్సే, కమ్యూనిటి ఎంపవర్మెంట్ అండ్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మంత్రి ఆర్ముగన్ తొండమాన్ ఉన్నారు. మంగళవారం ఉదయం ప్రధాని శ్రీవారిని దర్శించుకోనున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*