ఇంటి చుట్టూ కాకులు తిరిగితే ఆ ఇంటికి వాస్తు దోషం ఉన్నట్లేనా?

ఇంటి ఎదుట కాకి అరిస్తే ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారని అనడం సహజం. పాడు కాకి ఉదయం నుంచి ఒకటే గోల అని హూష్… అంటూ తరిమేస్తాం.

అదే కాకి ఇంటి చుట్టూ తిరుగుతూ అరిస్తే, ఏమవుతుంది.? ఉత్తీత అనే పక్షి ఇంటి మీది నుంచి అరుస్తూ వెళ్ళితే ఏదో అపశకునం జరుగుుతందని అర్థం.

మరి కాకి ఇంటి చుట్టూ తిరగడానికి అర్థం ఏంటి తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వార్త చదవాల్సిందే.

మన శరీరంలో అయస్కాంత శక్తి వుంటుంది. మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రభావం మన శరీరం మీద పడి తల తిరగుతుంది. అదే ప్రదేశంలో పడుకుంటే నిద్ర పట్టలేదని చెబుతాం.

దానికి కారణం ఏంటి? ఆ ప్రదేశంలోని అయస్కాంత క్షేత్రాల ప్రభావం మన శరీరంలోని అయస్కాంత శక్తిని ప్రభావితం చేస్తోందని అర్థం.

అదే ఒక ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు తలనొప్పి, చికాకు మొదలయినవి బాధపెడతాయి. దాని అర్థం ఏంటి? అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరుస్తూ ఉంటుంది. ఇది చూసిన మనం దాని చాయ్ అంటూ అదిలిస్తాం.

ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

కాబట్టి మనం ఇల్లు కట్టుకునే సమయంలోనే మనం ఆ స్థలాన్ని చూసి ఇల్లు కట్టుకోవాలి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*