
వేంకటేశ్వర భక్తి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
తిరుపతిలోని అలిపిరి వద్ద గల ఎస్వీబీసీ కార్యాలయంలో ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ తనకు అదనంగా అప్పగించిన ఈ బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్వీబీసీ బోర్డుకు, టిటిడి బోర్డు ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీవారి ఆశీస్సులతో స్వామివారి లీలావిశేషాలను, సేవలను, ఉత్సవాలను ఛానల్ ప్రసారాల ద్వారా భక్తులకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటానని వివరించారు.
ఛానల్ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ వెంకటనగేష్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ ఎసి.శ్రీ, టిటిడి ప్రాజెక్టుల లైజాన్ అధికారి శ్రీ వెంకటశర్మ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply