రథసప్తమికి విశేషంగా తరలివచ్చిన భక్తులు

సూర్యజయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు.

నాలుగు మాడ వీధుల్లోకి గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి.

ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.

చలికి, ఎండకు ఇబ్బందుల్లేకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక షెడ్ల‌లో భక్తులు సౌక‌ర్య‌వంతంగా కూర్చుని వాహ‌న‌సేవ‌ల‌ను తిల‌కించారు.

శ్రీవారి సేవ‌కులు భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేశారు.

షెడ్ల‌కు అనుబంధంగా మరుగుదొడ్లు, మూత్ర విసర్జనశాలలను భక్తులకు అందుబాటులో ఉంచారు.

వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా 25 ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం, ఇతర ముఖ్య కూడళ్లలో శోభాయమానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

300 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, 1000 మంది పోలీసుల సేవలను వినియోగించుకున్నారు.

3,500 మంది శ్రీవారి సేవకులు, 600 మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ భక్తులకు సేవలందించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేశారు.

సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్న టిటిడి ఈవో

వాహనసేవలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు గ్యాలరీల్లో కల్పించిన సౌకర్యాలను టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

టిటిడి సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాలు బాగున్నాయని, ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటు బాగుందని ధన్యవాదాలు తెలియజేశారు.
.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*