అహోబిల క్షేత్రంలో న‌ర‌సింహ మ‌హాయాగం

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన అహోబిల క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఫిబ్ర‌వ‌రి 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు న‌ర‌సింహ మ‌హాయాగం జ‌రుగ‌నుంది.

ప్ర‌పంచ‌శాంతి కోసం, మాన‌వులకు భ‌యం,ఈతి బాధ‌లు తొల‌గించాల‌ని న‌ర‌సింహ‌స్వామివారిని ప్రార్థిస్తూ ఈ యాగం నిర్వ‌హిస్తామ‌ని దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు తెలిపారు.

ఈ మూడు రోజుల పాటు ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు యాగం నిర్వ‌హిస్తారు.

ఈ సంద‌ర్భంగా మ‌న్య‌సూక్త పారాయ‌ణం, న‌ర‌సింహ స్తుతి పారాయ‌ణం చేస్తారు.

సాయంత్రం భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు న‌ర‌సింహ కీర్త‌న‌లతో భ‌జ‌న‌లు, ధార్మిక ప్ర‌వ‌చ‌నాలు నిర్వ‌హిస్తారు. ఈ యాగంలో 300 మంది భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు పాల్గొంటారు.

ఫిబ్ర‌వ‌రి 3న చెన్నైలో శ్రీనివాస కల్యాణం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమల వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన చెన్నైలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది.

చెన్నైలోని వేళచ్చేరిలో గ‌ల‌ గురునాన‌క్ క‌ళాశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వ‌హిస్తారు.

శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆర్ఎస్‌.గోపాల్ ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*