మాఘ మాసంలోనే నువ్వులు ఎందుకు తినాలి? చర్మ క్యాన్సర్ వస్తుందా?

హిందూ ధర్మంలో నువ్వులకు ఎక్కడ లేని స్థానం ఉంది. పిల్లలకు పెట్టే పదార్థాల నుంచి పిండప్రధానం చేసే వరకు నువ్వులను వాడుతూనే ఉంటారు. నువ్వులకు ఉండే స్థానం అలాంటిది మరి.

కానీ, నువ్వులను ప్రత్యేకించి మాఘం మాసంలో తప్పని సరిగా తినాలని అంటారు ఎందుకు? అలా తినకపోతే ఏమవుతుంది. చర్మ రోగాలు వస్తాయా? అంటే అవుననే చెబుతున్నాయి మన శాస్త్రాలు.

తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చదవాల్సిందే.

మాఘమాసం లో వచ్చే ముఖ్యమైన రోజులలో తిల చతుర్థికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తిలలు అంటే నువ్వులు. ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తినాలనిమాఘపురాణంచెబుతోంది.

తిల చతుర్థి రోజు నువ్వులతో చేసిన వంటకాలు తినటమే కాదు,నువ్వుల ఉండలు చేసి పంచుతారు,నువ్వులని బ్రాహ్మలకు దానమిస్తారు.

ఎందుకూ అందులోనూ, శాస్త్రీయత దాగి ఉంది. చలికాలం వెళ్లి ఎండాకాలం వచ్చే ఇలాంటి సమయం ఇది. అంటే వాతావరణంలో మార్పులు వస్తాయన్నమాట. మెల్లమెల్లగా ఎండలు పెరుగుతాయి.

సూర్య కిరణాలు చర్మంపై పడి చర్మ కణాలు ప్రమాదాలకి గురవుతాయి. సూర్యకిరణాల ధాటికి క్యాన్సర్‌లాంటి వ్యాధులకు కూడా గురి కావచ్చు.

అందుకే నువ్వులను తినటం వలన చర్మ కణాలకు కలిగే ప్రమాద తీవ్రతను అవి తగ్గిస్తాయి. ఇవి కిరణలకు బహిర్గతమైనపుడు చర్మ కణాలకు కలిగే మరకలను, మచ్చలను నువ్వులలో ఉండే మూలకాలు శక్తి వంతంగా తగ్గిస్తాయి.

అంతేనా అంటే అంతే కాదు. ఆరోగ్య కోణంలో నువ్వులకు చాలా ప్రాధాన్యతే ఉంది. ఎముకల బలహీనతతో బాధపడే వారు చెంచాడు నువ్వుల్ని నానబెట్టి ఉదయాన్నే పాలలో కలిపి సేవిస్తే ఈ రుగ్మతల నుంచి బయట పడతారు.

రక్త హీనతతో బాధ పడే వారు. చెంచాడు నువ్వులు నానబెట్టి నిత్యం మూడునెలలపాటు తీసుకుంటే రక్తం వృద్ధిచెందడమే కాకుండా ఉదర సంబంధిత వ్యాధుల్ని నిర్మూలిస్తుంది.

బుతుక్రమంతో ఇబ్బంది పడే అమ్మాయిలను నువ్వులు ఎక్కువగా తినమంటారు.

నువ్వుల నూనెలో క్యాల్షియం అధికంగా ఉండటంవల్ల కీళ్ళను కాపాడుతుంది. నువ్వులు నూనె చాలా తేలికగా జీర్ణం అవుతుంది. పెద్దప్రేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

అంతేకాదు నువ్వుల నూనెలో ఉన్న మెగ్నీషియం ఆస్తమా, లో బ్లడ్ ప్రెషర్ వంటి వాటిని తగ్గిస్తుంది. నువ్వులు దంత క్షయాన్ని పోగొడతాయి.

నువ్వులలోని సుగుణాలను గ్రహించిన పెద్దలు ప్రత్యేకమైన రోజు కేటాయించారు. ఫలితంగా నువ్వులు తినడం అలావాటు అవుతుందని దానిని ఆచారంగా తీసుకువచ్చారు.

ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టె తిల చతుర్థి అని నువ్వులకి కూడా ఒక ప్రత్యేక రోజుని కేటాయించారు మన పెద్దవాళ్ళు .

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*