మనుషుల కైనా… పంటల కైనా.. ఆ నీరే  సర్వరోగ నివారిణి

అక్కడ నీరు సేవిస్తే సర్వరోగాలు నయమైతాయి…. పొలాల్లో చల్లితే పంటలు బాగాపండుతాయి….

దీనిని నమ్మగలరా… నమ్మలేమంటే కుదరదు.. కొన్ని తరలా విశ్వాసం. ఆక్కడి భక్తులకు విశ్వాసం.

మీరు కూడా తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక కథనాన్ని చదివి తీరాల్సిందే.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలోని స్వయంభు సుబ్రహ్మణ్యం స్వామి ఆలయానికి వెళ్ళాలి .

మూల విరాట్టు అడుగు భాగాన 3.5అడుగుల కోనేరు ఉంది. ఇక్కడ కోనేటి నీరు మధురాతి మధురంగా ఉంటాయి.

వీటిని సేవిస్తే సర్వ రోగాలు నయం అవుతాయి. పొలాలలో చల్లితే పంటలు బాగాపండుతాయి. ఎండాకాలం, వానాకాలం, అన్న తేడా లేకుండ నిరంతరం ఆ కోనేటిటిలో నీటిమట్టం తగ్గదు.

ఎప్పుడైనా చేతికందుతాయి. అదే ఎక్కడి ప్రత్యేకత.
ఇక్కడ చుట్టూ చెట్లు ఆహ్లాదమైన ప్రకృతి, చుట్టూ కొండలు మధ్యలో చిన్నగుట్టపై వెలిశాడు.

“గుంటిసుబ్రమణ్యేశ్వరుడు “జిల్లాలో ఉన్న ఏకైక స్వయంభుగా స్వామి వెలిశాడు. తూర్పు ముఖంగా నాగేంద్రుని ఆకారం లో పెద్ద గుండు.

వెనుక సర్ప ఆకారం లొ ఏడుపడిగాలు గుండుపై కన్పిస్తాయి ఆ రాతి గుండునే స్వామి ప్రతి రూపం.

రాతిక్రింద విగ్రహం. గుంటి సుబ్బారాయుడు గాపిలిచే స్వామి గుంటి క్రింది సుబ్బారాయుడుగా మారాడు.

పూర్వం ఇక్కడ ఏడు పడిగల దర్శనం ఇచ్చాడని చెబుతారు. గుంటి ఆకారం లో కూడా ఏడు పడిగాలు కన్పిస్తాయి.

పూర్వం స్వామి వారుకోలువై ఉన్నప్రాంతం లో శివాలయం నిర్మించుకొని తపస్సు చేశారని, ఆశివాలయయం ఇప్పుడు కూడా ఉంది.

9లేదా 11వారలు నియమ, నిష్ఠలతో ప్రదక్షిణాలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయి.

స్వామి వారి ఆలయానికి ఈశాన్య మూలలో, సిగురు చెట్టు ఉంది.

ఆ చెట్టు నుండి శ్రావణమాసం లో ఉత్పత్తి అగు చక్కర లాంటి పదార్థాన్ని స్వామి వారి ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు.

చెట్టు కు కొంతదూరం లోని పుట్ట ఉంది. ఆపుట్ట లో తెల్ల నాగు నివసిస్తోందని, ఆపాము అప్పుడప్పుడు భాక్తులకీ దర్శన భాగ్యం కల్పిస్తుంది.

దర్శించిన వారు స్వామి కనిపించినంత ఆనంద పరవశులవుతారు. ప్రత్యేక్షంగా చూశారు.

రాయలసీమలో ఎక్కడ లేని విధంగా 108 లింగాకార సాలగ్రామ లను లింగాకారం లో ప్రతిష్టించారు. గోకర్ణ సమాన లింగాలని అంటారు.

సాయిబాబా, అయ్యప్ప, నవగ్రహ మంటపాలు వేరు వేరుగా ఉన్నాయి. ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది.

మాఘ మాసం వచ్చిందంటే అన్ని ఆదివారాలు పండగరోజులే. అనంతపురం పట్టణానికి 16కిలోమీటర్లు.

ఆర్టీసీ ఆదివారాలలో ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఉదయం 8నుండి సాయంత్రం 5వరకు ఈ ఈనెల ఆదివారాలలో అన్నదానం ఉంటుంది.

ఉత్సవాలు, అభిషేకాలు, హోమాలు, శివరాత్రి బాగా నిర్వహిస్తారు. సంతానం కోసం నాగ దోష నివారణ హోమం  చేస్తారు

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*