ట్రైనీ ఐఏఎస్‌లకు టిటిడిపై అవగాహన

టిటిడి కార్యకలాపాలపై 19 మంది శిక్షణ ఐఏఎస్‌లకు టిటిడి అద‌నుపు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేష‌న్‌తో అవగాహన కల్పించారు.

తిరుమ‌ల‌లోని గోకులం విశ్రాంతి గృహంలో గ‌ల స‌మావేశ మందిరంలో సోమ‌వారం ఉద‌యం ఈ కార్యక్రమం జరిగింది.

టిటిడి అమలుచేస్తున్న ఆధ్యాత్మిక, ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు, వైద్య శాల‌లు,  విద్యాసంస్థ‌ల  గురించి వివరించారు.

టెక్నాలజీ సాయంతో పారదర్శకంగా భక్తులకు అందిస్తున్న సేవలు, లడ్డూ ప్రసాదాల పంపిణీ, వసతి, దివ్యదర్శనం, స‌ర్వ‌ద‌ర్శ‌నం, టైంస్లాట్‌, ఆన్‌లైన్‌ సేవలు, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవ కార్యకలాపాలను తెలిపారు.

అదేవిధంగా టిటిడిలో జ‌రుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, టిటిడిలో పరిపాలన క్రమశ్రేణి, అధికారుల బాధ్యతలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను వారికి తెలియజేశారు.

టిటిడి నిర్వ‌హిస్తున్న వివిధ ట్ర‌స్టులు, వేద విద్య‌వ్యాప్తికి తీసుకుంటున్న చ‌ర్య‌లు వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాధ్‌, డిఈవో మ‌రియు లైజ‌న్ అధికారి డా.ర‌మణ‌ప్రసాద్,

సెట్విన్ సిఈవో మ‌రియు ప్ర‌భుత్వ లైజ‌న్ అధికారి ముర‌ళికృష్ణ‌, క్యాటరింగ్ అధికారి శాస్త్రి, రిసెప్షన్ డెప్యూటీ ఈవో బాలాజీ,

కల్యాణకట్ట‌ డెప్యూటీ ఈవో సెల్వం, విఎస్‌వో మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*