
ఫిబ్రవరి 1న తిరుమలలో అద్భుత కార్యక్రమం జరగబోతుంది. దర్శించుకోవాలని కొనేవారు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోండి.
రథ సప్తమిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
ఈ ఏర్పాటును పర్యవేక్షించడానికి టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి సోమవారం ఉదయం అధికారులతో కలిసి పరిశీలించారు.
ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి 9.00 గంటల వరకు వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలు, చక్రస్నానం, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో వివరించారు.
భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు టి, కాఫి, పాలు, తాగునీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలు నిరంతరాయంగా పంపిణీ చేస్తామన్నారు.
గ్యాలరీలలో ఉన్న భక్తులకు అన్నప్రసాద వితరణకు ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
భక్తులకు మరింత మేరుగైన సేవలందించేందుకు అదనపు సిబ్బందికి డెప్యుటేషన్ విధులు కేటాయిస్తున్నట్టు తెలియజేశారు.
ప్రతి గ్యాలరీలో శ్రీవారి సేవకులు, ఆరోగ్య సిబ్బంది ఉంటారని, సీనియర్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు.
భక్తులు సంయమనంతో వ్యవహరించి గ్యాలరీల్లో వేచి ఉండి వాహనసేవలను తిలకించాలని కోరారు.
ముందుగా గ్యాలరీల్లో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక షెడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మాడ వీధుల్లో తీర్చిదిద్దుతున్న రంగవల్లులను పరిశీలించారు.
అదనపు ఈవో వెంట టిటిడి సిఇ రామచంద్రారెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, ఎస్ఇ-2 నాగేశ్వరరావులు ఉన్నారు.
అలాగే ఎస్ఇ(ఎలక్ట్రికల్) వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Leave a Reply