
వింటుంటూనే ఆశ్చర్యం కలుగతోంది కదూ. విడ్డూరంగా తోస్తోంది కదూ…! వింటుంటూనే కొట్టాలనిపిస్తోంది.. కదూ… మీకు ఆశ్చర్యం కలిగినా, విడ్డూరంగా తోచినా… మీకు కొట్టాలనిపించినా సరే. ఇది నిజం.
కొందరు పండితులు అలా చెబుతున్నారు. అందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు. విరిగిన విగ్రహాలను, పాడైన చిత్ర పటాలను కాల్చేయండి లేదా నిమజ్జనం చేయండి అని చెబుతున్నాయి.
ఎందుకలా? అని అడిగే వారి కోసం ఈ వార్త. వివరాలేంటో మీరే చూడండి.
తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు, పటాలు ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అందుకే వారు దగ్గర్లోని దేవాలయంలోనో లేదా రోడ్డుప్రక్కన ఉన్న పచ్చని చెట్టు క్రింద వదిలేస్తారు.
అలా రోడ్డు పక్కన ఉన్న మన హిందూ దేవుళ్ళ ఫోటోలు చూసి ఇతర మతస్తులు మనల్ని చులకనగా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకోవడంలో కూడా తప్పులేదు.
ఆ అవకాశం మనం ఇతరులకు ఇవ్వరాదు. అంతకాలం పూజలందుకున్న స్వామి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని అలా వదిలి వేయడం తప్పు.. పరమ తప్పు.
స్వామిని అలా రోడ్డు మీద పడేయడం అపచారం. సరే తప్పే.. పరమ తప్పే అనుకుందాం. అయితే ఏం చేయాలి? అనేది ప్రశ్న.
దయచేసి మనకు అవసరం లేని పటాలను లేదా దేవుడి బొమ్మలను అగ్నికిఆహుతి ఇవ్వడం మంచి పద్దతి. అలా పక్కన పడేస్తే తప్పులేదు కానీ ఏకంగా పడేయమంటారేంటి? అనే ప్రశ్న మీలో తలెత్త వచ్చు.
ఎందుకు అలా చెబుతున్నారంటే అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు.
సరే అగ్గిలో వేసి కాల్చడం మీకు ఇష్టం లేదు. ప్రవహిస్తున్న నదిలో గాని మన ఊరి చెరువుల్లో గాని “నిమజ్జనం” చేయండి. వినాయక విగ్రహాలను అదే కదా చేస్తున్నాం.
విగ్రహాలు పూజలందుకున్న తరువాత నీటిలో నిమజ్జనం చేస్తున్నాం. ఇది కూడా అలాగే చేస్తే తప్పులేదని పండితులు చెబుతున్నారు.
కానీ, అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి నమస్కరించి ” గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ” అని అనుకుని ఆ పని చేయాలి. ఇది కూడా ఒక విధమైన నిమజ్జనమే.
హిందూ ధర్మంలో నిమజ్జనం చేయడంలో తప్పులేదు.
Leave a Reply