
శివుడు పులి చర్మాన్నే ఎందుకు ధరిస్తాడు? జింక చర్మాన్ని ఎందుకు ధరించడు అనే ప్రశ్న మరీ విడ్డూరంగా ఉంది. అది ఆయనకున్న అలవాటు. మన పురాణాలు కూడా అలా చెబుతున్నాయని సర్దుకునే వారి కోసం కాదిది.
మరెవ్వరి కోసం? ఎవరైతే తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం… పులి చర్మానికి శివుడికి ఉన్న సంబంధం ఏమిటి? మన పురాణాలు ఏం చెబుతున్నాయని తెలుసుకోవాలనుకునే వారి కోసం ఈ వార్త
శివుడు లయకారుడన్న విషయం మనకు తెలిసిందే. హిందూ మతంలోని ప్రధాన దేవుళ్లలో శివుడు ఒకరు. ప్రత్యేకతను కలిగి ఉన్నవాడు. అందరు ఉన్నట్లు కాకుండా భిన్నంగా ఉంటాడు. విభిన్నంగా కనిపిస్తాడు.
సింధూ నాగరికత కాలానికే శివుడు లింగం రూపంలోను, పశుపతిగాను పూజలందుకున్నాడు. ఇవి చరిత్ర చెబుతున్న సత్యాలు. దేశంలో శివాలయాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.
ఇతర దేవతలతో విభిన్నంగా కనిపించే శివుడు ఎల్లప్పుడూ పులి చర్మాన్నే ధరిస్తాడు. కారణమేంటి? ఆయన కోరుకుంటే పట్టుపీతాంబరాలు ఆయన వద్దకు రావా?
మరి ఎందుకు శివుడు పులి చర్మాన్ని ధరిస్తాడు. అంటే శివ పురాణంలో ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో శివుడు అరణ్యంలో వెళుతుండగా శివుని తేజస్సును చూసి మహర్షులు, రుషులు, పండితుల భార్యలు ఆశ్చర్యపోతారు.
దివ్య తేజస్సు కలిగిన శివుడిని చూడాలని మునికాంతలలో కాంక్ష పెరగి పోతుంది. దీంతో ఇంటి పనులు కూడా సక్రమంగా చేసేవారు కాదట.
తమ భార్యలలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో మునులకు మొదట అర్థం కాలేదు. ఆ తరువాత శివుడు ఇందుకు కారణమని అతనిని హతమార్చాని పన్నాం వేస్తారు.
తమ మంత్ర శక్తితో పులిని తయారు చేస్తారు. శివుడు ప్రతి రోజు ప్రయాణించే మార్గంలో గుంత తవ్వి ఆ పరిసర ప్రాంతాలలో పులిని అందుబాటు ఉంచుతారు.
శివుడిని నేరుగా తామేమి చేయలేమని తెలుసుకున్న మునులు శివుడు ఆ గుంత సమీపంలోకి రాగానే పులిని ఆయనపైకి ఉసిగొల్పుతారు. అయితే సునాయసంగా పులిని సంహరిస్తాడు.
మునుల చర్య వెనుక ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న శివుడు పులి చర్మాన్ని కప్పుకోవడం ఆరంభిస్తాడు. ఇందులో రెండు అర్థాలు వస్తాయి. అహంకారాన్ని విడనాడమని మునులకు, మానవవాళికి అర్థం.
అదే సమయంలో కోరికలకు దూరంగా ఉండమని రెండో సందేశం కనిపిస్తుంది.
Leave a Reply