ఇంటిని కట్టుకోవడానికి ఎలాంటి స్థలాన్ని కొనాలో మీకు తెలుసా..?

ఇల్లు కట్టి చూడు. పెళ్ళి చేసి చూడు అన్నారు పెద్దలు. వారు ఎంతో అనుభవంతోనే ఈ మాట చెప్పి ఉంటారు. అందులో ఎటువంటి అనుమానం లేదు కదా.

ఇట్లు కట్టే సమయంలోనే కాదు, ఇంటి స్థలం కొనుగోలు చేసే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఆ ఇంట్లో జీవనం సుఖమయం, ప్రశాంతంగా ఉంటుంది.

అలాంటప్పుడు ఎలా స్థలాన్ని కొనుగోలు చేయాలంటే… కింద తెలిపిన వాటిని అనుసరిస్తే మంచిది.

ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా స్థలాన్ని ఎంపిక చేస్తున్నామంటే ఆ స్థలం ఈశాన్యంలో ఎట్టి పరిస్థితులలోనూ కట్ అయి ఉండరాదు.

అలాగే ఈ శాన్య భాగంలో దిబ్బలు, ఎత్తైన భారీ భవంతులు, సెల్ ఫోన్ టవర్లవంటి ఉండకూడదు.

ఒక వేళ దిబ్బలు, మెట్లు ఉంటే వాటిని కొనడానికకి ముందే తొలగించే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలి.

తూర్పున దిశన కూడా భారీ భవంతులు, కట్ అయి ఉండడం వంటివి జరగరాదు. ఒక వేళ ఉంటే వాస్తు ప్రకారం సరి చేసుకునే అవకాశం ఉంటేనే కొనుగోలు చేసుకోవాలి.

ఒక వేళ ఆగ్నేయంలో స్థలం కట్ అయి ఉంటే ఎటువంటి ఇబ్బందీ లేదని గుర్తుపెట్టుకోవాలి. దాని వలన మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. అభివృద్ధి ఉంటుంది.

కొనుక్కునే స్థలం దక్షిణ భాగం ఉచ్చంగా, ఎత్తుగా ఉంటే మంచిదే. అలాగే దక్షిణ భాగంలో కొలనులు, గుంతలు, పెద్ద పెద్ద కాలవలు ఉన్నచో ఆ ఇంటిని కొనకపోవడం ఉత్తమం.

నైరుతీ భాగం పెరిగి ఉండకూడదు. తప్పని సరిగా కొనుక్కోవాల్సి వస్తే పెరిగిన స్థలాన్ని మినహాయించుకునే విధంగా ఉండాలి.

అదే సమయంలో నైరుతీ భాగంలో ఎత్తు కలిగిన భవంతులు ఉంటే నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు.

పడమర దిక్కున, లేదా దక్షిణ దిక్కున పల్లం, లేదా గుంతగా ఉంటే అస్సలు కొనుగోలు చేయాల్సిన పని లేదు. చివరకు అద్దెకు ఉండడం కూడా మంచిది కాదు.

వాయువ్య దిశలో బావులు, గుంతలు ఉండరాదు. అవే గుంతలు, ఈశాన్య దిక్కున ఉంటే మరి మంచిది.

ఈశాన్య దిక్కున వీధి పోటు ఉంటే ఎటువంటి సంశయం లేకుండా కొనుగోలు చేయవచ్చు. అది ఉత్తమం కూడా

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*