దళారుల ఆట కట్టించాం –  ప్రతి భక్తుడికి ఉచిత లడ్డూ ఇచ్చాం

తిరుమలకు విచ్చేసిన ప్రతి వెంకటేశ్వరస్వామి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ ఇచ్చామని కొండ పై ఎలాంటి దళారులు లేకుండా చేశామని టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు.

71 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం ఆయన తిరుమలలో జాతీయ జెండాను ఎగరవేశారు.

అనంతరం మాట్లాడుతూ తిరుమలలో ద‌ళారుల‌ను అరిక‌ట్టి, అవినీతిని నిర్ములించ‌డ‌మే లక్ష్యంగా ముందుకు వెళుతున్న‌ట్లు ఉద్ఘాటించారు.

య‌స్‌.సి., య‌స్‌.టి., బి.సి.ప్రాంతాల‌లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి ఏర్పాటు చేసిన శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలు అందించే దాత‌ల‌కు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాన్ని కేటాయించచినట్లు వివరించారు

తద్వారా ద‌ర్శ‌న ద‌ళారుల‌ను నిర్మూలించిన‌ట్లు అయ్యిందని తెలిపారు.

స్వామి ద‌ర్శనానికి వస్తున్న ప్ర‌తి భ‌క్తుడికీ ఉచితంగా 175 గ్రాముల ల‌డ్డూ అందిస్తున్నామ‌న్నారు. అద‌న‌పు ల‌డ్డూలను  వారికి అందుబాటులో ఉంచామన్నారు.

వ‌స‌తి విభాగంలో మ‌రిన్ని చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ద్వారా గ‌దుల ద‌ళారుల‌ను నిర్మూలించ‌నున్న‌ట్లు వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో సిఇ రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ 2 నాగేశ్వరరావు, ఎస్టేట్‌ ఆఫీసర్  విజయ సారధి, ఆరోగ్య శాఖ అధికారి డా.. ఆర్.ఆర్.రెడ్డి, విజివో మనోహర్ తదితరులు పాల్గొన్నారు

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*