కడపలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. జనవరి 26 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
శనివారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చన, తోమల సేవలు నిర్వహించారు.
అనంతరం శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది.
జనవరి 26న ధ్వజారోహణం :
జనవరి 26వ తేదీ ఆదివారం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 8.00 నుంచి 9.00 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ చక్రవర్తి గోవిందరాజన్, సూపరిండెంట్ శ్రీ నాదముని, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Venkateshwara Swami Brahmotsavams Started in Kadapa district on Saturday. The festivities will take place from January 26th to February 3rd.
In the early hours of Saturday morning, archakas awakened Lord Venkateswara and held Archana,Thomala sevas in the temple.
Subsequently, on the occasion of Lord Venkateswara’s birth Nakshtra, archakas performed Swamy Kalyanam in a grand manner from 10.00 am to 12.00 noon.
The ceremony held from 6.00 pm to 9.00 pm, followed by a ceremonial celebration of the Commander-in-Chief of Lord Venkateawara.
On Sunday, January 26 from 9:00 am to 10:00 pm, the Dwajarohanam will be conducted in meena Lagnam. On the same day by evening 8.00 pm to 9.00 pm Chandraprabha Vahana Seva will be held.
All arrangements have been completed in the temple for the Brahmotsavas.
For this festival, cultural activities were scheduled in daily manner in front of the Vahana Sevas. Daily Sevas will be held from 9.00 am to 10.00 am and again at 8.00 am to 9.00 pm.
Leave a Reply