టిటిడిలో మువ్వ‌న్నెల జెండా రెపరెపలు

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి.

ఇక్కడి పరేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణ అధికారి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.

ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 24 మంది అధికారులు, 205 మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు.

ఘాట్ రోడ్ల‌లో ప్ర‌మాదాల నివార‌ణ‌పై అవ‌గాహ‌న

ఘాట్ రోడ్ల‌లో ప్ర‌మాదాల‌కు దారి తీస్తున్న ప‌రిస్థితులు, వాటి నివార‌ణ‌కు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే అంశంపై 26 మంది ‌నివాస ప్ర‌యివేటు సెక్యూరిటీ సిబ్బంది చ‌క్క‌టి అవ‌గాహ‌న క‌ల్పించారు.

ద్విచ‌క్ర‌వాహ‌న‌దారులు హెల్మెట్ ధ‌రించ‌క‌పోవడం, కార్ల‌లో ప్ర‌యాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోక‌పోవ‌డం, డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్ మాట్లాడ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌మాదాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపారు.

ప్ర‌మాదాల నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను కూడా తెలియ‌జేశారు.

అదేవిధంగా, బాంబ్ స్క్వాడ్ ప్ర‌ద‌ర్శ‌నలో శున‌కాల ద్వారా బాంబులు, ఇత‌ర పేలుడు ప‌దార్థాల‌ను గుర్తించి నిర్వీర్వ్యం చేయ‌డాన్ని చూపారు.

డాగ్ షోలో శున‌కాలు మాద‌క‌ద్ర‌వ్యాలు, ఎర్ర‌చంద‌నం త‌దిత‌ర ప‌దార్థాల‌ను గుర్తించ‌డాన్ని ప్ర‌ద‌ర్శించారు. భ‌ద్ర‌తా సిబ్బంది పిర‌మిడ్ ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్‌వో గోపినాథ్‌ జెట్టి, అదనపు

సివిఎస్‌వో శివకుమార్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏవో ఓ.బాలాజి, విఎస్‌వో ప్ర‌భాక‌ర్‌రావు ఇతర విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*