అష్టాద‌శ పురాణాల ప‌రిష్క‌ర‌ణ పురోగ‌తిపై జెఈవో స‌మీక్ష‌/TTD JEO reviwed on Indian Puranas Printing in Tirupati

అష్టాద‌శ పురాణాల‌ పరిష్క‌ర‌ణ‌, గ్రంథ ముద్ర‌ణ ప‌నుల పురోగ‌తిపై టిటిడి జెఈవో పి.బ‌సంత్‌కుమార్ శ‌నివారం స‌మీక్ష నిర్వ‌హించారు.

తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ అష్టాద‌శ‌(18) పురాణాల‌ను వ్యాఖ్యాన స‌హితంగా తెలుగు అనువాదంతో ముద్రించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

ఈ ప‌నులు వేగ‌వంతంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు.

ఈ పురాణాల ప‌రిష్కార మండ‌లి సోమ‌వారం నుండి శ‌నివారం వ‌ర‌కు 6 రోజుల పాటు స‌మావేశ‌మై మ‌త్స్య‌పురాణంలోని ఒక భాగాన్ని ప‌రిష్క‌రించామని తెలపారు.

ముద్ర‌ణ‌కు సిద్ధం చేసి ముద్ర‌ణాల‌యానికి పంపిన‌ట్టు వివ‌రించారు.

ఇప్ప‌టివ‌ర‌కు 5 పురాణాల‌ను ముద్ర‌ణ‌కు సిద్ధం చేశామ‌ని, 18 భాగాలు అనువాద‌మై ప‌రిష్క‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయ‌ని తెలియ‌జేశారు.

ప‌రిష్క‌ర‌ణ మండ‌లి ప్ర‌తినెలా వారం రోజుల పాటు స‌మావేశ‌మై అనువాదం పూర్త‌యిన పురాణాల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని జెఈవో సూచించారు.

ఈ స‌మావేశంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి మరియు హెచ్ డిపిపి కార్యదర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్‌, డా. స‌ముద్రాల ల‌క్ష్మ‌ణ‌య్య‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

TTD JEO P Basantkumar conducted a review on Saturday on the progress of Puranas Printing work. JEO conducted this meeting in his office.

On this occasion, the JEO said that, it was undertaken to print the 18 puranas with a Telugu translation and that the work was speeding up.

The Puranas council held a meeting for six days from Monday to Saturday, explaining that a portion of the Matya Purana has been prepared and sent to the printing press.

He also said that, till today council has completed 5 Puranas and completed the translation part of the 18 puranas to Telugu language and know that is in review stage by the council.

To completed this big and prestigious project, council is sitting week days in a month.

HDPP secretary Raja gopalan, Samudra Lakshmanaiah, Doolipalla Annapoorna and others were attend the meeting

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*