కరకరకాకర కా కర….. గుక్క తిప్పుకోకుండా పాడగలరా.. ప్రయత్నిస్తారా?

తెలుగు పద్యాలలో చాలా అర్థాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వాటిని ఆలపించాలంటేనే చాలా చాతుర్యం, నైపుణ్యం కంఠత ఉండాలి.

అర్థం పర్థం లేని విధంగానే ఉంటాయని కానీ, అర్థం చేసుకుంటే చాలా అర్థం గోచరిస్తుంది. కోడ్ లాంగ్వేజ్ వీటి ముందు బలాదూర్ అన్నట్లు ఉంటాయి.

కింద ఉన్న పద్యాన్ని పాడే సత్తా మీలో ఉందేమో చూడండి. ఒక వేళ మీరు గుక్క తిప్పుకోకుండా పాడగలిగితే నిజం తెలుగు పండితులే. పండితులు కాకపోయినా ప్రయత్నించండి. అందులో ఇమిడి ఉన్న అర్థాన్ని తెలుసుకోండి.

కరకరకాకర కా కర
కరుకుకరకు రకరక కర కారక రాకా
కర కిరికిరికిరికిరకక
కురరీకర రకకర కర కొరకొర కొరకే

అన్న పద్యాన్ని ఏక బిగిని చదవగలరా! సంక్రమణ భోగి పర్వ శుభంకరుడైన సూర్య భగవానుని కీర్తిస్తూ రాసిన ద్వ్యక్షర కంద పద్యం ఇది.

కా = ఎక్కడ
కరకర= ౘురుకైన
కరుకు= గట్టిదైన
అరకు= పదునైన
రకరక= అనేక విధాలైన
కరకర= కిరణములనిౘ్చుటలో
కిరికిరికి= చిక్కులకు
ఇరుకక = దొరకకుండా
కారక= ముఖ్యుడవైన
ఆకర= ఆధార స్వరూపుడైన
ఇరికి= దొరికి
రాకా = వెన్నెలకకు
కర= కారకుడైన
కొరకొర = వేడియైన
కరకర = వాడియైన
కురరీకర= వేగవంతమైన
రక= స్వభావము గల
కర= కిరణములు
కొరకొర= కొంచెము
ఆకర= జీవుల
కొరకే= ఉద్ధరిoచడానికే

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*