పరిషేచన అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు?

సాంప్రదాయబద్దమైన పూజలు ఏదైనా దైవ కార్యక్రమాలు జరిగినప్పుడు అన్నం తినే విధానం ఇప్పుడైనా మీరు గమనించారా..?

అన్నం తినే ముందు తినే పళ్ళెం చుట్టూ అలా మంత్రం చదివి నీళ్ళేందుకు చల్లుతారు.

తరువాత ఒక ముద్ద తీసి ఇ కళ్ళకద్దుకుని పక్కన పెడతారు.

ఎందుకు ఇలా చేస్తారు అనేది ఎవ్వరికి తెలియదు. కానీ పెద్దలు చెప్పారు. మేం పాటిస్తున్నామని సమాధానం మాత్రం చెబుతారు.

ఇలా పళ్లెం చుట్టూ నీళ్లు చేరడాన్ని పరిషేచన అంటారు.

భోజనం ముందు పరిషేచన చెయ్యడం లో ఒక పెద్ద రహస్యం దాగి వుంది.

మనం తినే ప్రతీ మెతుకు మీదా మన పేరు రాసి పెట్టి ఉంది అంటారు పెద్దలు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినే మనం మన ప్రాణన్ని నిలబెట్టుకోగలుగుతున్నాము.

శక్తిని సంపాదించి పనులు చెయ్యగలుగుతున్నాము. ఇలా మనలోని అన్నం అరగాలన్నా, అన్నం శక్తిగా మారాలన్నా జఠరం సరిగ్గా పని చెయ్యాలి.

అహం వైశ్వానరో భూత్వాప్రాణినాం దేహమాశ్రితః ! ప్రాణాపానస మాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ !!

నేనే ప్రాణాపానసంయుక్తమైన వైశ్వానరుడు అనే అగ్ని రూపములో సర్వప్రాణుల శరీరముల యందుండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును.

పని భగవంతుడు స్వయంగా చెబుతున్నాడు.

ఆయన మనలో ఉండి అగ్నిరూపంలో మన ఆహారాన్ని జీర్ణం చేసి మనకు శక్తిని ఇస్తున్నాడు.

మనలో దేవుడు ఉన్నాడని అర్థం.ఆ భోజనాన్ని భుజించేవాడు కూడా తాను తింటున్న ఆహారాన్ని లోనున్న ఆత్మారాముని సంతృప్తి పరుస్తున్నాననిఅనుకోవాలి.

అదితే అనుమన్యస్వ. అనుమతే అనుమన్యస్వ. సరస్వతే అనుమన్యస్వ. దేవ సవితః ప్రసువ

అంటూ చేస్తున్న మనస్సుహోమగుండం చుట్టూ నీటితో పరిషేచన చేసి అగ్నిదేవునికి స్వాహాకారాలతో యజ్ఞం చేసినట్టు పరిషేచన చేసి భోంచేస్తాడు.

తింటున్న ఆహారం కూడా ఒక పూజ, ఒక యోగం. నీలో ఉన్న దేవునికి నువ్వు హవనం చేస్తున్నానని నమ్మి తింటే అది కూడా పూజే.

అందుకే కంచం ముందు కూర్చున్నప్పుడు ఇతర విషయాలు మాట్లాడకుండా కేవలం భోజనం మీద మనస్సు లగ్నం చేసి తినమని ఆయుర్వేదం చెబుతుంది.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*