నిస్వార్థ‌, నిరంహ‌కార‌, నిరాడంబ‌రంగా శ్రీ‌వారి భ‌క్తుల‌కు సేవ‌లందించాలి

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తులకు శ్రీ‌వారి సేవ‌కులు నిస్వార్థంగా, నిరాడంబ‌రంగా, అహంకార ర‌హితంగా సేవ‌లందించాల‌ని సత్యసాయి సేవా సంస్థ  తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు శ్రీ వెంక‌ట్రావ్ ఉద్ఘాటించారు.

తిరుమ‌ల‌లోని సేవాస‌ద‌న్‌లో గురువారం ఉద‌యం జ‌రిగిన స‌త్సంగంలో శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఉద్ధేశించి ప్ర‌సంగించారు.

శ్రీవారి సేవ‌కులు 7 రోజుల పాటు స్వామివారి క్షేత్రంలో ఉండి భ‌క్తుల‌కు సేవ‌లు అందించ‌డం పూర్వ జ‌న్మ సుకృత‌మ‌న్నారు.

శ్రీ‌వారి సేవ‌కులు ఇదే సేవా దృక్ప‌థంతో తమ తమ ప్రాంతాల‌కు వెళ్లిన త‌ర్వాత కూడా స్వచ్ఛందంగా సేవలందించాలని కోరారు.

శ్రీ‌వారి సేవ‌కులు స‌త్సంగం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ద్వారా మ‌రింత ఆధ్యాత్మిక శ‌క్తి మంతులై భ‌క్తుల‌కు విశేషంగా సేవ‌లందించ‌గ‌ల‌ర‌ని తెలిపారు.

అంత‌కుముందు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి నుండి విచ్చేసిన స‌త్య‌సాయి సేవా బృందంతో భ‌జ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

అనంత‌రం శ్రీ‌వారి సేవ యొక్క పూర్వాప‌రాల‌ను శ్రీ‌వారి సేవ విభాగాధిప‌తి డా..టి.ర‌వి వివ‌రించారు.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*