పిలిచి చూడడండి.. వేంకటేశ్వర స్వామి మీ ఇంటికే వస్తాడు…!

ఇదేదో పొద్దుపోకో… తమాషాకు చెప్పే మాట కాదు. నిజం. పచ్చి నిజం. మీరు పిలిచిన వెంటనే వేంకటేశ్వర స్వామి మీ ఇంటి వస్తాడు…

మీరు పెట్టిన నైవేద్యం ఆరగిస్తాడు. మీరు చేయించే అభిషేకాన్ని మనసారా స్వీకరిస్తాడు. మీరిచ్చే హారతీని గైకొంటాడు. నేనున్నాంటూ.. అభయమిస్తాడు..

అయితే మీరు స్వామిని శనివారం మాత్రమే పిలవాలి. అదోక నియమం ఉంది. నా మాట అబద్ధం అనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని అనంతపురం జిల్లాకు తీసుకెళ్ళాల్సిందే. రండి వెడదాం.

వేంకటేశ్వరస్వామిపై అచెంచల భక్తి ఈ విశ్వవ్యాప్తంగా ఉంది. తమ ఇలవేల్పుగా భావించి స్వామిని కొలిచేవారు చాలా మంది ఉన్నారు.

ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. కేవలం దేవాలయంలో మాత్రమే స్వామికి పూజాపునస్కారాలు జరుపుతారు. ఇది ఎక్కువ ప్రాంతంలో ఆచరణలో ఉంటుంది.

కానీ ఒక్క అనంతపురం పట్టణంలో మాత్రం అలా కాదు. స్వామిని మీరు ఆహ్వానించాలే గానీ, కుల,మత భేదంలేకుండా ఏ ఇంటికైనా విచ్చేస్తాడు.

ఇక్కడ గోవింద భజన సంఘం ఉంది. ఆ గోవింద భజన సంఘం నిర్వాహకులతో ‘స్వామి వారిని మాఇంటికి తీసుకరండి’ ఒక్కమాట చెబితే చాలు.

ఆ శనివారం స్వామి విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకువస్తారు. మొక్కుబడిగా విగ్రహాన్ని తీసుకురావడం కాదు. అర్చకుడితో సహా వస్తారు.

ఆ శనివారం ఆ భక్తుని ఇంటిలోనే స్వామికి అభిషేకం, అర్చన, పూజ, సంకల్పం కూడా నిర్వహిస్తారు. ఆళ్లగడ్డ రాము అధ్యక్షతన ఉన్న భక్త బృందం ఉదయం 7గంటలకే వెళ్లి పూజలు చేయిస్తారు.

వేంకటేశ్వర స్వామి భజనలు, సంకీర్తనలు, గానం చేస్తారు, నివేదనసల్పి, మహామంగళహారతి గావించి, వేదోక్తమంత్రాపుష్పన్ని స్వామి వారికి అర్పిస్తారు.

మీ ఇంటిని గోవిందనామస్మరణలతో మార్మోగిస్తారు. అనంతరం తీర్థ, ప్రసాదాలు అందిస్తారు.
మొత్తం మైకు హారతి ఖర్చు గోవిందనామ భజన సంఘం భరిస్తుంది.

హారతి పళ్లెం లోదక్షిణను ఇస్కాన్ గోశాలకు అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం వెంకన్న స్వామిని పిలిచి చూడడండి.

మీరు తిలకించండి... మీ మిత్రులకు పంపండి ఇలా..

Be the first to comment

Leave a Reply

your mail will not be display.


*